2013
వికీపీడియా నుండి
2013 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంఘటనలు[మార్చు]
- ఫిబ్రవరి 21 - హైదరాబాద్ లోని దిల్ శుఖ్ నగర్ ప్రాంతం లో సాయంత్రం 7:00 కు వరుస పేలుళ్ళు. 12గురు మృతి.
- జూలై 13: నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోడి సర్వయ్య మరణించారు.
- జూలై 30: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఆమోదం తెలిపింది.
- ఆగస్టు 11: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.
- సెప్టెంబరు 21: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్లో ప్రారంభమైంది.
- సెప్టెంబరు 28: పాలమూరు (మహబూబ్నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
- అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
మరణాలు[మార్చు]
- ఏప్రిల్ 21- అంబటి బ్రాహ్మణయ్య, ప్రముఖ రాజకీయ వేత్త (జ. 1940)
- మే 17 - కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి
- జూన్ 7 - జె.వి.రాఘవులు ( జెట్టి వీర రాఘవులు ), తెలుగు సినిమా సంగీత దర్శకుడు. /[జ. ]
- జూన్ 20- ఆలూరు భుజంగ రావు , విరసం సీనియర్ సభ్యుడు, ప్రముఖ రచయిత, అనువాదకుడు.
- ఆగష్టు 3- ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు.
- ఆగస్టు 1- పి.వి.రంగారావు, పి.వి.నరసింహారావు కుమారుడు, రాష్ట్ర మాజీ మంత్రి.
- ఆగస్టు 3- ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు.
- సెప్టెంబరు 16- తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది. /[జ. 1920]
- సెప్టెంబరు 20- ఛాయరాజ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు./[జ. 1948]
- డిసెంబరు 7- ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు.[జ. 1954]
ఇవి కూడా చూడండి[మార్చు]
|
||||||||||