మొదటి పేజీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 67,623 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
సూరి భగవంతం

సూరి భగవంతం (అక్టోబరు 14, 1909 - ఫిబ్రవరి 6, 1989) ప్రముఖ శాస్త్రవేత్త. దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. ఈయన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో అక్టోబరు 14, 1909 న జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం హైదరాబాదు నిజాం కళాశాలలో డిగ్రీ (బి.ఎస్సీ) చదువు పూర్తిచేసి, మద్రాసు యూనివర్సిటీ నుండి బి.ఎస్.సి (భౌతిక శాస్త్రము) డిగ్రీని ప్రథమ శ్రేణిలో ప్రథముడుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా అనేక పతకాలను అందుకున్న విద్యార్థిగా కలకత్తాలో సర్ సి.వి.రామన్ దగ్గర రీసెర్చ్ స్కాలర్ గా చేరాడు. ఈయన తన మేథో సంపత్తితో, శాస్గ్త్రీయ దృక్పథంతో, ఆలోచనా సరళితో, ప్రయోగ శీలతతో సి.వి.రామన్ అభిమానాన్ని చూరగొని ప్రియ శిష్యుడయ్యాడు. అక్కడే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్సీ. పట్టాను సంపాదించాడు. ఈయన 1932లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో అధ్యాపకుడుగా చేరాడు. 1938లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందాడు. బోధనా విధానంలో వీరిది చాలా సులభశైలి. స్పష్టమైన వ్యక్తీకరణ, విశేషమైన ఆలోచన, కచ్చితమైన అనువర్తన, సమగ్రమైన దృష్టి, అద్భుతమైన ప్రతిభ లన్నీ కలగలిపి వీరి బోధనా విధానాన్ని ఇతర శాఖల అధ్యాపకులు కూడా నేర్చుకునేవారని చెబుతారు. తన 28 వ యేటనే యింతటి ఉన్నత పదవిని అదిష్టించటం విశేషం. దీనికి కొద్ది కాలం ముందే యూనివర్సిటీ ఈయనకు డి.ఎన్‌సి డిగ్రీ ప్రదానం చేసింది.

(ఇంకా…)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 9:
  • ప్రపంచ తపాలా దినోత్సవం
  • 1562 : ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త మరియు వైద్యుడు గాబ్రియల్ ఫెలోపియో జననం.
  • 1874 : హైదరాబాదు రైల్వే స్టేషను ప్రారంభం.
  • 1945 : ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం.
  • 1967 : దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు చే గెవారా మరణం.
  • 2008 : తొలి తెలుగు గిరిజన దినపత్రిక ‘మన్యసీమ’ మొదటి ప్రతి ప్రచురించబడింది. [1].
  • 2009 : నార్వే నోబెల్ కమిటీ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది.
  • 2013 : తెలుగు చలనచిత్రన నటుడు శ్రీహరి మరణం.





ఈ వారపు బొమ్మ
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవరణలో దేవకాంచనం (రక్తకాంచనం) పువ్వు. ఈ చెట్టు చాలా ఔషధ గుణాలు కలది.

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవరణలో దేవకాంచనం (రక్తకాంచనం) పువ్వు. ఈ చెట్టు చాలా ఔషధ గుణాలు కలది.

ఫోటో సౌజన్యం: Paryavarana Margadarsi Vaisakhi
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
విజ్ఞానము మరియు సాంకేతికం
భాష మరియు సమాజం
తెలంగాణ
ప్రపంచము
క‌ళలు మరియు ఆటలు
విశేష వ్యాసాలు

భారతీయ భాషలలో వికీపీడియా

অসমীয়া (అస్సామీ)बोडो (బోడో)भोजपुरी (భోజపురీ)বাংলা (బెంగాలీ)বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)डोगरी (డోగ్రీ)English (ఆంగ్లం)कोंकणी (కొంకణి)ગુજરાતી (గుజరాతీ)हिन्दी (హిందీ)ಕನ್ನಡ (కన్నడం)कश्मीरी (కశ్మీరీ)मैथिली (మైథిలీ)മലയാളം (మలయాళం)मराठी (మరాఠీ)नेपाली (నేపాలీ)ଓଡ଼ିଆ (ఒడియా)ਪੰਜਾਬੀ (పంజాబీ)Pāḷi (పాళీ)संस्कृत (సంస్కృతం)Santali (సంతాలి)سنڌي (సింధి)தமிழ் (తమిళం)اردو  (ఉర్దూ)

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్ లేక వికీమీడియా భారతదేశం (వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ) నకు సహాయము చెయ్యండి . మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు మరియు వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మొదటి_పేజీ&oldid=2113076" నుండి వెలికితీశారు